ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం పట్టణంలోని పెద్ద కూరగాయల మార్కెట్ యూనియన్ సభ్యులు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గిద్దలూరులోని అన్న క్యాంటీన్ నిర్వహణకు తమ వంతు సహకారంగా రూ.15,000 నగదును ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారందరిని అభినందించారు.