అల్లూరి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం ఆదివాసీ ప్రజాసంఘాల నాయకులు అత్యవసరంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 11,12 తేదీల్లో జరిగే మన్యం బంద్కు తగిన కార్యచరణ ఈ సమావేశంలో రూపొందించారు. ఈ బంద్ని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయలని కోరారు. ఈ సమావేశంలో పలువురు రాజకీయ పార్టీ, ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు.