ప్రకాశం: దోర్నాలలోని స్థానిక నటరాజ్ సెంటర్ వద్ద గల ఫ్యాన్సీ షాప్లో అక్రమంగా దాచి ఉంచిన బాణాసంచాను ఎస్సై మహేశ్ పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనుమతుల్లేకుండా ఎవరైనా దీపావళి సామాగ్రి ఇళ్లల్లో కానీ, గోడౌన్లలో కానీ దాచుకున్నట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు పాటిస్తూ అనుమతులు తీసుకొని బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేయాలన్నారు.