బాపట్ల: పంగులూరు నుంచి బూదవాడ వెళుతున్న 108 అంబులెన్స్‌కు ఇంకొల్లు నుంచి అద్దంకి వెళుతున్న ఆర్టీసీ బస్సు దారి ఇవ్వని సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అంబులెన్స్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పంగులూరు సెంటర్‌కు వచ్చేసరికి ఎదురుగా బస్సు వచ్చింది. అంబులెన్స్‌ను వెళ్లనివ్వకుండా అడ్డుకొని వాదనకు దిగాడు. దీంతో 108 పైలట్ వెనక్కి వెళ్లడు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.