SKLM: ఆర్.ఆమదాలవలస మండలం వావిలవలస గ్రామంలో సుమారు 250 గొర్రెలు అంతు చిక్కని వ్యాధితో మరణిస్తున్నట్లు గొర్రెల కాపరులా దారులు అంటున్నారు. అసలు వ్యాధి ఏంటో తెలియడం లేదని వారు వాపోతున్నారు. ముఖ్యంగా ప్రసవ సమయంలో ఎక్కువగా చనిపోతున్నాయని అంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, తగు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.