ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయమే మిగిలి ఉన్నా నాయకులు మాత్రం ఇప్పటి నుంచే ఎవరి ఎత్తులు వారు వేసుకుంటూనే ఉన్నారు. కొందరు నేతలు.. పార్టీలు మారే పనిలో ఉంటే.. కొందరు నేతలు.. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తే గెలుస్తామా ఇలా ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తాయా అని అభిమానులు సైతం లెక్కలు వేసుకుంటూ ఉంటున్నారు. కాగా.. తాజాగా… ఈ విషయంపై పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలవబోతోందనే విషయంపై పవన్ కళ్యాణ్ లెక్కలు చెప్పారు. తాజాగా ఆదివారం మంగళగిరిలో జరిగిన జనసేన లీగల్‌సెల్ సమావేశం లో పవన్ మాట్లాడు తూ… ఓ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 47 నుంచి 67 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వైసీపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. హామీలు నెరవే ర్చని పార్టీకి, ప్రభుత్వానికి చట్టాలు చేసే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే ప్రజలు వైసీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పవన్ చెప్పారు. ఆ ఆగ్రహమే వారిని 2014 స్థాయికి దిగజార్చుతుందని.. చెప్పుకొచ్చారు. సమస్యలపై ప్రశ్నించేందుకు వేదిక కావాలనిపించిందన్నా రు. ప్రశ్నించేందుకు, సేవ చేసేందుకే పార్టీ స్థాపించినట్లు వివరించారు. గెలిచేవరకు మళ్లీ మళ్లీ దెబ్బలు తినడానికి సిద్ధమని పవన్ స్పష్టం చేశారు. తన జీవితంలో చేసిన మంచి పని పార్టీ పెట్టడమన్నారు. 2019లో ప్రజలు ఏ ఉద్దేశంతో వైసీపీకి ఓటు వేశారో గానీ.. దాని పర్యావసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు.
ఏపీకి నేడు రాజధాని లేకుండా పోయిందని పవన్ అన్నారు. తానుఎక్కడికి వెళ్లినా.. మీ రాజధాని ఎప్పుడు కడుతున్నారు? ఎక్కడ కడుతున్నారని.. ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు. చట్ట సభల్లో మాట ఇచ్చి వెనక్కిపోతే ఇక విలువేముందని ప్రశ్నించారు. వేల ఎకరాలు వద్దు.. చిన్న రాజధాని చాలని మిత్రపక్షంగా చెప్పానన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి 30 వేల ఎకరాలు అవసరం అన్నారని.. ఇక్కడే ఇల్లు కట్టానని.. అమరావతిని అభివృద్ధి చేస్తానని అన్నారని తెలిపారు. ఓట్లు వేయించుకున్నాక మాట తప్పి మోసం చేశారని మండిపడ్డారు. 3 రాజధానుల పేరుతో వివాదం చేసింది ఎవరని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.