ఆన్లైన్ లోన్ యాప్ (Loan app) పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఇప్పటికీ వాటి ఆగడాలు మాత్రం ఆగటంలేదు. అడగకుండానే రుణాలు ఇచ్చి.. అనంతరం గడువుకు ముందే తిరిగి చెల్లించాలని లేదంటే.. పరువు తీస్తామని వేధించడంతో చాలా మంది ఆత్మహత్య(suicide)లకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీ లోని బాపట్ల (Bapatla) జిల్లాకు చెందిన అనే యువకుడు… రెండేళ్ల క్రితం లోన్ యాప్స్ నుంచి రూ. 50 వేలు తీసుకున్నాడు. ఇందులో రూ. 40 వేలు తిరిగి కట్టిన అతను..మిగతా నగదు టైమ్‌కు లోన్ డబ్బులు తిరిగి చెల్లించలేకపోయాడు. ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని, కొంత సమయం ఇవ్వాలని కోరాడు. వడ్డీ(interest)తో సహా తిరిగిచ్చేస్తానని కొరాడు.
కానీ లోన్ యాప్ నిర్వాహకులు వినలేదు. మరో రూ. 50 వేలు కట్టాలని వేధించసాగారు. అభ్యంతకరమైన మెసేజ్ లు పంపుతూ మానసికంగానూ కృంగదీశారు. అతని ఫోటోలు నగ్నంగా ఎడిట్ చేసి…. డబ్బులు తిరిగివ్వాలని..లేకపోతే వాటిని వైరల్ చేస్తామని బెదిరించారు. రెండేళ్లుగా లోన్ యాప్ వేధింపులు (Harassment) భరించిన సాయి…చివరకు ఆత్మహత్యకు యత్నంచాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సాయిని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించారు. అయితే తాను లోన్ యాప్ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించానని సాయి లేఖ రాశాడు. రెండేళ్లుగా లోన్ యాప్ నిర్వాహకులు తనను వేధిస్తున్నారని.. డబ్బులు (money) కట్టలేని పరిస్థితుల్లోనే తాను ఆత్మహత్యకు యత్నించానని లేటర్ లో తెలిపాడు. అయితే సాయి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.