Chandrababu: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సాధించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu) విమర్శించారు. ఇండియప్ టెక్ అండ్ ఇన్ ఫ్రా కంపెనీ చేసిన ట్వీట్‌ను షేర్ చేశారు. 2023 ఏడాదిలో ఎఫ్‌డీఐలు సాధించిన రాష్ట్రాలను జాబితాను ఆ సంస్థ ట్వీట్ చేసింది. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రస్తావిస్తూ.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సాధించడంలో రాష్ట్రం ఎందుకు వెనకబడిందని చంద్రబాబు (Chandrababu) నిలదీశారు. ఇదీ ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యం అన్నారు. ఎఫ్‌డీఐ సాధించడంలో ఏపీ ర్యాంక్ 13వ చోటుకు దిగజారిందని చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. జగన్ అనుసరిస్తోన్న వ్యుహాలు రాష్ట్రానికి పెట్టుబడులు.. దాంతోపాటు ఉద్యోగాలను కూడా దూరం చేస్తున్నాయని తెలిపారు. దోచుకో, పంచుకో, తినుకో అనే విధానంలో దేశంలో అత్యంత ధనిక సీఎం జగన్ అయ్యారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలు మాత్రం కనీస అవసరాలకు నోచుకోవడం లేదని చెప్పారు. జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారని.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చంద్రబాబు (Chandrababu) వివరించారు.
ఇండియన్ టెక్ అండ్ ఇన్ ఫ్రా కంపెనీ చేసిన ట్వీట్ ప్రకారం ఎఫ్‌డీఐ ఆకర్షించడంలో మహారాష్ట్ర (Maharashtra) ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. కర్ణాటక, ఢిల్లీ వరసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్, హర్యానా, తమిళనాడు, తెలంగాణ వరసగా జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టాప్-10లో కూడా చోటు లభించలేదు. 13వ స్థానంలో నిలువడంతో చంద్రబాబు మండిపడ్డారు.
Where does Andhra Pradesh stand on this list, @ysjagan?
Your FAILURE to run the state properly has pulled AP down to 13th rank on FDI. Your strategies are driving investments and jobs out of AP.
People have had enough of your "Dochuko, Panchuko, Tinuko" style of governance… https://t.co/YJdQPJDxdd