మన్యం: బడి దేవరకొండ జోలికి వస్తే బడితి పూజ తప్పదని పార్వతీపురం జనసేన నాయకుడు ఆదాడ మోహన్ అన్నారు. ఈ మేరకు బడిదేవర కొండ వద్ద అక్రమ మైనింగ్ నిలిపివేయాలని నిరసన తెలియజేశారు. ఇక్కడ ప్రాంత వాసులు ఆరాధ్య దైవంగా కొలిచే కొండను ఎలా మైనింగ్‌కు ఇస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై కలెక్టర్‌కు, ప్రభుత్వానికి వినతిపత్రం అందజేసి వాస్తవాలకు తెలుసుకొని మైనింగ్ నిలిపివేయాలని కోరుతున్నారు.