ఫేస్ సర్టిఫికేట్ అంటూ తన పైన వచ్చిన ఆరోపణల మీద ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ (andhra pradesh assembly speaker) తమ్మినేని సీతారామ్ (thammineni seetharam) స్పందించారు. తన మీద తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party Leader) నేత చేసిన ఆరోపణలు, ఫిర్యాదు పైన తగిన సమయంలో సమాధానం ఇస్తానని చెప్పారు.
ఫేస్ సర్టిఫికేట్ అంటూ తన పైన వచ్చిన ఆరోపణల మీద ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ (andhra pradesh assembly speaker) తమ్మినేని సీతారామ్ (thammineni seetharam) స్పందించారు. తన మీద తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party Leader) నేత చేసిన ఆరోపణలు, ఫిర్యాదు పైన తగిన సమయంలో సమాధానం ఇస్తానని చెప్పారు. తన పైన గవర్నర్ కు, ఇతర ముఖ్యులకు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారని, వారికి అలా చేసే హక్కు ఉందన్నారు. వారు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చునని, అందులో ఎలాంటి తప్పు లేదన్నారు. కానీ తాను ఏ తప్పు చేయలేదని, అలాంటప్పుడు తాను ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, వాస్తవాలు అన్నీ వెలుగులోకి వస్తాయన్నారు.
ఇది చదవండి: Thammineni Education: నకిలీ డిగ్రీతో ఏపీ స్పీకర్ లా అడ్మిషన్: రాష్ట్రపతికి టీడీపీ నేత ఫిర్యాదు
కాగా, స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ నేత కూన రవి కుమార్ ఫేక్ సర్టిఫికెట్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తమ్మినేని గౌరవప్రదమైన స్పీకర్ (Speaker) పదవిలో ఉన్నారని, కానీ డిగ్రీ తప్పుడు సర్టిఫికెట్ (Fake Degree certificate) సమర్పించి మూడు సంవత్సరాల న్యాయ విద్యలో అడ్మిషన్ పొందినట్లు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ టీడీపీ నేత (Srikakulam district TDP president Kuna Ravikumar) ఫిర్యాదు చేశారు. తమ్మినేని (thammineni seetharam) నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ తో మూడేళ్ల లా కోర్సులో అడ్మిషన్ తీసుకున్నారని ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు (President of India Droupadi Murmu) విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతితో పాటు తెలుగు రాష్ట్రాల గవర్నర్లు (Telugu States Governors), సుప్రీం కోర్టు (Supreme Court), హైకోర్టు సీజేలకు (Hihg Court), ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు (Chief Minister of Andhra Pradesh, YS Jagan Mohan Reddy) ఆయన లేఖలు రాశారు.