»Nara Lokesh It Is Not The Government That Is Afraid Of Your Warnings
Nara Lokesh: మీ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం కాదు
మాజీ సీఎం జగన్ హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అవినీతి గురించి మాట్లాడటం వింతగా ఉందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. మీ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం కాదు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వమిదని లోకేశ్ అన్నారు.
Nara Lokesh: It is not the government that is afraid of your warnings
Nara Lokesh: మాజీ సీఎం జగన్ హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అవినీతి గురించి మాట్లాడటం వింతగా ఉందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. బాధితులనే నిందితులుగా చేసిన చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటింది. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా బలవంతంగా తేంచేస్తుంది. ప్రజలు ఇచ్చిన తీర్పుతో జగన్ తన ఉనికి కోల్పోయారు. జగన్ అసత్య ప్రచారాలతో అబద్ధపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నారని లోకేశ్ అన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్యా రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని లోకేశ్ అన్నారు. శవాలతో రాజకీయాలు చేసే మీకు మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో మీకు ఇంకా అర్థం కాలేదా? నేరాలు చేసి మళ్లీ వాటిని వేరే వారిపై నెట్టడం నాటకాలు చేస్తుందని లోకేశ్ అన్నారు. ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నాం. ఏ ఘటననూ కూడా వదిలేదీ లేదు. బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదు. మీ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం కాదు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వమిదని లోకేశ్ అన్నారు.