ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై ఏపీలో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ తప్పుపడుతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు విమర్శలు చేస్తున్నారు. కాగా… ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి మాత్రం ఈ విషయంలో షాకింగ్ కామెంట్స్ చేయడం గమనార్హం.
ఆ యూనివర్సిటీ పేరు మార్పును లక్ష్మీపార్వతి పరోక్షంగా సమర్థించారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని, అది ప్రభుత్వం నిర్ణయం అని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు .
అదేవిధంగా, ముఖ్యమంత్రి జగన్…ఆ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ యూనివర్సిటీగా మార్చాలని నిర్ణయించారని అన్నారు. అయితే, ఎన్టీఆర్ కుటుంబసభ్యురాలిగా జిల్లా పేరు మార్పు, యూనివర్సిటీ పేరు మార్పు అంటూ రెండు తనకు రెండు ఆప్షన్లు ఇస్తే జిల్లా పేరు మార్పుకే మొగ్గు చూపుతానని చెప్పారు. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించినా పర్వాలేదు అనే ఉద్దేశంలో లక్ష్మీపార్వతి మాట్లాడారు.
అంతేగానీ, ఎన్టీఆర్ చొరవతో ప్రారంభించిన హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం సరికాదని ఆమె ఖండించలేదు. అంతేకాదు, ఈ పేరు మార్పు వ్యవహారం నేపథ్యంలో తనపై తన వ్యక్తిగత జీవితంపై కొన్ని మీడియా సంస్థలు దాడి చేస్తున్నాయని, ఇష్టానుసారం తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెడతానని లక్ష్మీపార్వతి హెచ్చరించారు.
తమ వివాహం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికీ లేదు అంటూ ఆమె కామెంట్ చేశారు. తమ వివాహం గురించి, తనకు రాజకీయాలపై ఆసక్తి లేదన్న విషయం గురించి ఎన్టీఆర్ ఎన్నోసార్లు చెప్పారని గుర్తు చేశారు. కావాలంటే ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు, వీడియోలు చూడాలని అన్నారు. ఏది ఏమైనా, ఆ పేరు మార్పును సమర్థిస్తూ లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోస్తా జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కోస్తా రాయలసీమకు భారీ వర్ష సూచన ఉంది. నాలుగు, ఐదు, ఆరు తేదీల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభావంతో పలు చోట్ల వానలు కురియనున్నట్లు తెలిపారు.