Kanna : టీడీపీలో చేరేందుకు కన్నా కి ముహూర్తం ఫిక్స్..!
Kanna : ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయానికి నేతలు.. తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడ్డారు. పార్టీ లు మారాలి అనుకునేవారు మారుతున్నారు. ఇటీవల కన్నా లక్ష్మీ నారాయణ కూడా... బీజేపీకి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. కాగా.. త్వరలోనే టీడీపీలో చేరేందుకు ఆయన లైన్ క్లియర్ చేసుకున్నారు.
ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయానికి నేతలు.. తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడ్డారు. పార్టీ లు మారాలి అనుకునేవారు మారుతున్నారు. ఇటీవల కన్నా లక్ష్మీ నారాయణ కూడా… బీజేపీకి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. కాగా.. త్వరలోనే టీడీపీలో చేరేందుకు ఆయన లైన్ క్లియర్ చేసుకున్నారు.
ఈ నెల 23న తన అనుచరులతో కలిసి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ తీర్ధం స్వీకరించనున్నారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. గతంలో చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ టీడీపీపై ఘాటు విమర్శలు చేశారు. ప్రస్తుతం వాటన్నిటినీ పక్కన పెట్టి తన రాజకీయ భవిష్యత్తును ఆలోచనలో పెట్టి టీడీపీలోకి చేరేందుకు మనసును సిద్ధం చేసుకున్నారు.
2019 ఎన్నికలకు 10 నెలల ముందు కన్నా లక్ష్మీ నారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రాధాన్యత తగ్గింది. బీజేపీ అధిష్టానం సోమువీర్రాజుకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి కన్నా లక్ష్మీనారాయణ అసంతృప్తితో ఉన్నారు. సోము వీర్రాజు కూడా తనదైన శైలిలో దూసుకుపోతు, కన్నాను కన్నా అనుచరులను పక్కన పెడుతూ వచ్చారు. తన టీమ్ సిద్ధం చేసుకున్నారు. ఈ కారణంగా కన్నా లక్ష్మీ నారాయణ పార్టీకి దూరమౌతు వచ్చారు. ఢిల్లీలో సమావేశాలు జరిగినా వెళ్లేవారు కాదు. రాష్ట్రానికి బీజేపీ అగ్ర నాయకులు వచ్చినా కలిసేవారు కాదు. తన ఉద్దేశ్యాన్ని చాటుకున్నారు. పార్టీని వీడారు. టీడీపీ గూటికి చేరనున్నారు.