తమిళనాడు మాజీ సీఎస్, జనసేన సలహాదారు ఆర్ రామ్మోహన్ బుధవారం నాడు ప్రగతి భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈయన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాపు నేత. ఇటీవలే తోట చంద్రశేఖర్ తదితర కాపు నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో మరో కాపు నేత కేసీఆర్ ని కలవడం చర్చకు దారి తీసింది. ఈ భేటీ సమయంలో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులు కాపు చంద్రశేఖర్, బీఆర్ఎస్ నేత పార్థసారథి కూడా ఉన్నారు. ఈ భేటీలో ఏపీ రాజకీయాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చాయట.
సీఎం శ్రీ కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ సలహాదారుడు, తమిళనాడు మాజీ సీఎస్ ఆర్. రామ్మోహన్ రావు గారు. pic.twitter.com/R8qQ8kjJrl
జనవరి 18న బీఆర్ఎస్ ఆవిర్భావ సభను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు కేసీఆర్. ఇలాంటి సమయంలో ఏపీకి చెందిన కీలక నేతలు ఆయనను కలవడం గమనార్హం. అయితే సీఎం కేసీఆర్‌ను రామ్మోహన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారని ఎమ్మెల్యే బాల్క సుమన్ ట్వీట్ చేశారు. త్వరలో విజయవాడలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. సభ్యత్వ నమోదు, నిర్మాణాత్మక వైఖరితో ముందుకు వచ్చే వారిని పార్టీలో చేర్చుకోవాలని కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు.