ASR: గసబ పంచాయితీ మొర్రిగూడ గ్రామంలో రచ్చబండ నిర్మాణంకు గ్రామ పెద్దలు పాంగి అగడ, వంతాల మొస్య శనివారం శంకుస్ధాపన చేశారు. ఈ రచ్చబండ కు 15వ ఆర్ధిక సంఘం నిధుల నుండి రూ.2లక్షలు మంజూరు అయినట్లు వార్డ్ సభ్యులు పీ.సత్యన్నారాయణ తెలిపారు. గ్రామ సమస్యలు చర్చించు కోవడానికి, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి రచ్చబండ ఉపయోగంగా ఉంటుందని మాజీ సర్పంచ్ సురేష్ అన్నారు