KKD: కాకినాడ డెవలప్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీల్లో జిల్లాస్థాయి చదరంగం ఓపెన్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ దివ్యతేజ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అండర్-7, 9, 11, 13, 15, ఓపెన్ విభాగాల్లో జరుగుతాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు కాకినాడ, రామారావుపేట, 3-లైట్ జంక్షన్ వద్ద గల అకాడమీకి హాజరుకావాలన్నారు.