PLD: ఎన్నికల హామీల అమలుకు ప్రత్యేక హెడ్లు ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. సూపర్సిక్స్ హామీల అమలుకు నేరుగా కేటాయింపులు ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టేందుకు బడ్జెట్ కేటాయింపులు దోహదం చేస్తాయన్నారు.