కృష్ణా: బాపులపాడులోని జగనన్న కాలనీలో అంతర్గత రహదారులు అధ్వానంగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. కొద్దిపాటి వర్షానికే రోడ్లు బురదమయమై గుంతలతో నిండిపోవడంతో రాకపోకలు సర్కస్ ఫీట్లను తలపిస్తున్నాయి. వృద్ధులు, చిన్నారులు చెప్పులు చేతిలో పట్టుకుని నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 200 ఇళ్లలో 1000కి పైగా ఉన్న కనీస మౌలిక వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.