కోనసీమ: ముమ్మిడివరం నియోజకవర్గం వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షులుగా కోన వెంకట అఖిలేష్ రెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధిష్టానం తనను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు విడుదల చేసిందని ఆయన తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం రావడానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.