ATP: గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ప్రమాద ఘటనలో క్షతగాత్రులకు, మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా ఇంఛార్జ్ మంత్రి టీజీ.భరత్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ భరోసా ఇచ్చారు. అనంతపురం నగరంలోని కిమ్స్ సవేరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.