ATP: రాయదుర్గం పట్టణంలోని వివిధ రకాల వృత్తులకు చెందిన వారు ఆయా పనుల్లో మరింత మెరుగైన నైపుణ్యాలను పొందేందుకు నైపుణ్య శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. జనవరి 2వ తేదీలోగా మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా విభాగంలో దరఖాస్తులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇచ్చి, ధ్రువపత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.