సత్యసాయి: ప్రజల నుంచి వచ్చిన భూ సమస్యలపై అవగాహన పెంపొందించుకొని వాటిని సత్వరమే పరిష్కరించుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టిఎస్ చేతన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్తో కలిసి జిల్లాలోని ఆర్డీవోలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.