అనంతపురం: కుందుర్పి మండల కేంద్రంలో అందరికీ సుపరిచితుడైన సప్లయర్స్ చాకలి భీమప్ప ఆదివారం రాత్రి నిద్రలోనే తుది శ్వాస విడిచాడు. గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భీమప్ప మృతిపట్ల గ్రామస్థులతో పాటు ఆయా రాజకీయ పార్టీ నాయకులు సంతాపం ప్రకటించారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.