ప్రకాశం: కనిగిరి అమరావతి గ్రౌండ్స్‌లో గురువారం కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి గ్రామం నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి 17 కుటుంబాలు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో చేరారు. ఎమ్మెల్యే వారందరికీ కండువా కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు.