E.G: ఉజ్వల దీపం 2 పథకాలతో మహిళల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగు నింపుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే టీడీటీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. శనివారం మల్లేపల్లి గ్రామంలో ఉజ్వల పథకం కింద 20 మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్స్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఒక్కొక్కరికీ రూ.5వేల విలువైన 20 కనెక్షన్స్ మహిళలకు అందజేసారు.