కృష్ణా: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కుటుంబం కృషి చేస్తుందని పెనమలూరు MLA బోడె ప్రసాద్ అన్నారు. ఉయ్యూరు(M) కాటూరులో PHC సెంటర్లో 15వ ఫైనాన్స్ నిధులు రూ.50 లక్షల వ్యయంతో పబ్లిక్ హెల్త్ యూనిట్ నూతన భవనానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.