VSP: విశాఖలోని రద్దీగా ఉండే జైలు రోడ్డు పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన, ఖాళీ స్థలాల్లో చెత్త కుప్పలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీనివల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీన్ని త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.