అరకు: మండలం సంఘం వలస గ్రామ సమీపంలో రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్థంభం కూలేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు స్థంభానికి ఆనుకుని ఉన్న మట్టి పెళ్లలు జారిపడ్డాయి. దీంతో విద్యుత్ స్థంభం వొరిగిపోయి ఉంది. ఏ క్షణాన కూలిపోతుందో తెలీని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.