PPM: 104 ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ 104 ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిరసన దీక్షలు చేపట్టారు. గత 3 నెలల నుండి జీతాలు అందక తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బకాయి వేతనాలు చెల్లించి, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.