ELR: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో విద్యుత్ శాఖ సిబ్బందిని ఎస్ఈ పి. సాల్మన్ రాజు బుధవారం అప్రమత్తం చేశారు. పట్టణంలో ఆర్.ఆర్.పేటలోని విద్యుత్ భవన్లో 9440902926, జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యాలయంలో 9491030712 నంబర్లతో 24 గంటల కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.