ప్రకాశం: చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మంగళవారం విజయవాడలో మంత్రి సత్య కుమార్ యాదవ్‌ను కలిశారు. చీరాలలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కొరకు మరిన్ని నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. వచ్చే బడ్జెట్లో హాస్పటల్ అభివృద్ధి కొరకు మరిన్ని నిధులు కేటాయిస్తానని మంత్రి ఎమ్మెల్యే కొండయ్యకు హామీ ఇచ్చారు.