Akp: నామినేటెడ్ పోస్టుల్లో రెల్లిలకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు యర్రంశెట్టి పాపారావు అన్నారు. సోమవారం బలిఘట్టంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గంలో కూడా రెల్లి కులానికి ఎమ్మెల్యే స్థానం కల్పించకపోవడం దారుణమన్నారు.