KKD: ఈనెల 14న జరగనున్న సాగునీటి సంఘాల ఎన్నికలకు బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ షన్మోహాన్ సగిలి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం సాగునీటి సంఘాలకు రెండు అంచెల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. 14న అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, 17న డిస్ట్రిబ్యూషన్ కమిటీకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.