KKD:పెద్దాపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ సిబ్బంది ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్దాపురం పరిధిలో సారాయి తయారీ కోసం నిల్వ ఉంచిన 600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సీఐ అర్జునరావు తెలిపారు. ఉప్పలపాడులో 600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై ప్రసాదరావు, సిబ్బంది పాల్గొన్నారు.