VZM: తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి సంపద కేంద్రానికి తరలించాలని బొబ్బిలి MPDO పి. రవికుమార్ గ్రీన్ అంబాసిడర్లను ఆదేశించారు. గురువారం మండలంలోని పెంట గ్రామంలో పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ఇంటిలో చెత్తను బయట వేయకుండా గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలని, ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితేనే ఆరోగ్యంగా ఉండగలమన్నారు.