TTD : తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఏప్రిల్ 10 నుండి 15వ తేదీ వరకు ఈ – వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇది పూర్తిగా ఆన్ లైన్ లో వేయనున్నారు. కొత్తవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 297 లాట్లు మొదలగునవి ఈ వేలం వేయనున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఏప్రిల్ 10 నుండి 15వ తేదీ వరకు ఈ – వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇది పూర్తిగా ఆన్ లైన్ లో వేయనున్నారు. కొత్తవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 297 లాట్లు మొదలగునవి ఈ వేలం వేయనున్నారు.
సిల్క్, పాలిస్టర్ దోతీలు, ఉత్తరీయాలు, చీరలు, ఆఫ్ చీరలు, క్లాత్ బిట్స్, బ్లౌజ్పీస్లు, టర్కీ టవళ్లు, లుంగీలు, శాలువలు, బెడ్షీట్లు,హుండీ గల్లేబులు, దిండుకవర్లు, పంజాబీ డ్రెస్ మెటీరియల్స్, జంకాళం కార్పెట్లు,కార్టెన్లు, గర్భగృహ కురాళాలు, బంగారువాకిలి పరదాలు, శ్రీవారి గొడుగులు ఉన్నాయని వివరించారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్సైట్ www.tirumala.org , www.konugolu.ap.govt.in సంప్రదించాలని సూచించారు.
తిరుమలకు వచ్చే నెల ఏప్రిల్ మాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ రోజు టీడీడీ విడుదల చేయనుంది. ఆన్ లైన్ టికెట్లను ఉదయం 11 గంటల నుంచి బుక్ చేసుకోవచ్చని టీటీడీ సూచించింది. ఇదే సమయంలో తిరుమలలో శ్రీరామ నవమి ప్రత్యేక ఉత్సవాల నిర్వహణను ఏర్పాట్లు ప్రారంభించింది.