»Another Leopard Trek On The Alipiri Footpath Area Tirupati
Another leopard: అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత సంచారం
తిరుమల తిరుపతి అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత సంచరిస్తోంది. ఇప్పటికే మూడు చిరుతలు పట్టుకున్నప్పటికీ మళ్లీ ఇంకో చిరుత సంచరించడం స్థానికుల్లో భయాందోళన రేకెత్తిస్తోంది.
Another leopard trek on the Alipiri footpath area tirupati
ఏపీలోని తిరుమల తిరుపతి అలిపిరి భక్తుల కాలినడక ప్రాంతంలో మరో చిరుత సంచారం చేస్తుంది. లక్ష్మినరసింహ ఆలయం సమీపంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇది తెలిసిన భక్తులు మళ్లీ భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇటివల చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి లక్షిత మృత్యువాత చెందిన ప్రాంతంలోనే ఇది తిరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.