Andhra Pradesh capital Amaravati case adjourned to December
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసును సుప్రీం కోర్టు డిసెంబర్‌కు వాయిదా వేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం ఈ మేరకు తెలియజేసింది. కేసును అత్యవసరంగా విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపు న్యాయవ్యాది కోరగా.. నవంబర్ వరకు రాజ్యంగా ధర్మాసన కేసులు ఉన్నాయని ధర్మాసనం తెలిపింది. డిసెంబర్ లోపు అత్యవసర విచారణ జరిపించడం వీలుకాదని పేర్కొంది. ఇక ఏపీ రాజధాని విషయంలో ఎన్నికలు అయ్యే వరకు క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదని తాజా వాయిదాను బట్టి తెలుస్తుంది.