»Alert To Devotees Of Tirumala Those Services Are Canceled For 5 Days
TTD: తిరుమల భక్తులకు అలర్ట్..5 రోజుల పాటు ఆ సేవలు రద్దు
తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. శ్రీవారికి సంబంధించిన దర్శన వేళలు, పలు రకాల సేవలు గురించి తెలుసుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు. తాజాగా మార్చి నెలకు సంబంధించి తిరుమల(Tirumala)లో నిర్వహించే ప్రత్యేక పర్వదినాలను టీటీడీ(TTD) వెల్లడించింది. శ్రీవారి ఆలయంలో మార్చి 3వ తేది నుంచి 7వ తేది వరకూ పలు ఆర్జిత సేవలను టీటీడీ(TTD) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

తిరుమల(Tirumala) శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 3వ తేది నుంచి మార్చి 7వ తేది వరకూ జరగనున్నాయి. ఈ విషయాన్ని టీటీడీ(TTD) ప్రకటనలో తెలిపింది. తెప్పోత్సవాలు నిర్వహించే ఆ ఐదు రోజుల్లో రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకూ పుష్కరిణిలో శ్రీవారు, అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.
మార్చి 3వ తేదిన శ్రీరామచంద్రమూర్తి అవతారం, 4న శ్రీకృష్ణ స్వామి అవతారం, 5న మలయప్పస్వామి అవతారంలో పుష్కరిణిలో శ్రీవారు తెప్పపై విహరిస్తూ దర్శనం ఇవ్వనున్నారు. అలాగే చివరి రోజు మార్చి 7వ తేదిన ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో దర్శనం ఇవ్వనున్నారు. ఈ తెప్పొత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్న తరుణంలో పలు రకాల సేవలను టీటీడీ(TTD) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.