PPM: తుపాను వర్గాలకు కురుపాం మండలం, వలసబల్లేరు పంచాయతీ, ఆగంగూడ బీటీ రోడ్డుపై కొం డచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆదారిలో ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.బుధవారం ఈ విషయం తెలుసుకున్న నీలకంఠాపురం ఎస్ఐ నీలకంఠారావు ఘటన స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ట్రాక్టరు, జేసీబీ సాయంతో రోడ్డుపై కొండచరియలను తొలగించి సమస్యను పరిష్కరించారు.