AKP: నర్సీపట్నం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు బాబురావు మాస్టర్ మాట్లాడుతూ.. ఉత్తరాది ప్రాంతంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు.