VZM: విజయనగరం జిల్లా యువజన సర్వీసుల శాఖ సెట్విజ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా వయోజన విద్యా శాఖ ఉప సంచాలకులు ఏ. సోమేశ్వర రావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సీఈవోగా వున్న రాంగోపాల్ తన మాతృశాఖకు వెళ్లడంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు ఇంఛార్జ్ సీఈవోగా సోమేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు.