TPT: నాయుడుపేట మండలం బిరదవాడకు చెందిన ఓ యువకుడు శ్రీకాళహస్తి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మునిశేఖర్ నాయుడుపేటలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నారు. తిరుపతికి పని నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా శ్రీకాళహస్తి సమీపంలో ఆయన బైక్కు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో మునిశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.