ATP: మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తండ్రికి తగ్గ తనయుడిగా చిన్న వయసులోనే కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన యువ నాయకుడని ఆమె కొనియాడారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.