W.G: పశ్చిమగోదావరి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఆచంటలో కొలువైన శ్రీ ఆచంటేశ్వర స్వామి వారి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు, పర్యాటకులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సన్నిధి రాజు కొండయ్య, శంకరమంచి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు పెద్ద ఎత్తున నిర్వహించారు.