VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో 32వ వార్డు పరిధిలో మంచినీటి బోరుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. ఇది గత కొన్ని రోజులుగా పనిచేయకపోవడంతో ఆ ప్రాంతంలో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కార్పొరేటర్ కందుల నాగరాజు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన అధికారులు గురువారం మంచినీటి బోరు మరమ్మతులు చేపట్టారు.