ప్రకాశం: ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ గ్రామంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వ్యవసాయ అధికారులు ఫారుక్ హాజరయ్యారు. మొక్కజొన్న కంది పంటలో యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. వరి పంటకి మానికాయ వచ్చే అవకాశం ఉందని, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.