GNTR: సీఎం సహాయనిది పేదలకు సంజీవనిలా ఉపయోగపడుతుందని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. గురువారం నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.97,69,780 విలువైన చెక్కులను లబ్ధిదారులకు ఆయా మండలాల నాయకుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు వెంకట సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.