SKLM: రణస్థలం మండలంలోని కృష్ణాపురం పంచాయతీ గొర్లెపేట గ్రామంలో గంట్యాడ రమణ అనే వ్యక్తి రోడ్డుకు అడ్డంగా గోడ కట్టాడు. దీంతో గ్రామస్థులు అవాక్కయ్యారు. ఇలా రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ గోడ కట్టడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గ్రామంలోని పలువురు పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తామన్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.