TPT : నూతన సంవత్సర వేడుకలను సాకుగా చూపి బైక్లు, కార్లను రేసింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త సంవత్సరాన్ని ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. డిసెంబరు 31 రాత్రి శ్రీకాళహస్తి పట్టణంతో పాటు తొట్టంబేడు, బీఎన్ కండ్రిగ రోడ్డులో తనిఖీలుంటాయాన్నారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.